శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు
NEWS Apr 19,2025 10:30 am
తిరుమల క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 519 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 360 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం టీబీసీ వరకు భక్తుల లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.