మే 11 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
NEWS Apr 19,2025 07:42 am
టీటీడీ కీలక ప్రకటన చేసింది. న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 10న సాయంత్రం అంకురార్పణం జరుగనుందని పేర్కొంది. బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించ నున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.