మోదీ పర్యటన కోసం ఆర్గనైజింగ్ కమిటీ
NEWS Apr 18,2025 08:23 pm
మే 2వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు పీఎం మోదీ. ఈ సందర్బంగా ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు నారాయణ, లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభ్యులుగా నియమించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.