హైదరాబాద్ లో కుండపోత వర్షం
NEWS Apr 18,2025 08:17 pm
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, మాదాపూర్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది. వర్షం కారణంగా మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్, గాంధీ ఆస్పత్రి, మెట్టుగూడ ప్రాంతాల్లో చెట్లు కూలి పోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.