కోటరీ వల్లే వైసీపీ నుంచి బయటకు వచ్చా
NEWS Apr 18,2025 08:12 pm
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలో నంబర్ 2 అనే స్థానం ఉండదన్నారు. అదంతా మిథ్య. పార్టీలోని కోటరీ తనను వెన్నుపోటుదారుడు అని నమ్మించే ప్రయత్నం చేసిందంటూ వాపోయారు. ఇవాళ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. కోటరీలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని చెప్పారు. కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఏ రోజూ తాను ఎంపీ కావాలని అనుకోలేదన్నారు.