1000 విద్యార్థుల వీసాలు రద్దు చేసిన అమెరికా
NEWS Apr 18,2025 06:37 pm
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన కొన్ని వారాల్లోనే ఏకంగా 1000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఓహియో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. ఏయే అంశాలతో వీసాలు రద్దు చేస్తున్నారో తెలపక పోవడంతో భయాందోళనకు లోనవుతున్నారు. దీంతో గత్యంతరం లేక అక్కడ న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారు.