హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్
NEWS Apr 18,2025 06:24 pm
హైదరాబాద్ లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి టెక్ దిగ్గజాలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్ వర్క్స్ . ఈ మేరకు సీఎం బృందంతో చర్చలు జరిపారు. ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 400 మెగావాట్ల డేటా సెంటర్, 25000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటింగ్ సదుపాయాలు కలుగుతాయి. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాజధానిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు సీఎం.