హైడ్రాపై మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు..?
NEWS Apr 18,2025 06:00 pm
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు హైడ్రాపై ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లు, ఆస్తులను కూడా కూల్చుతున్నారంటూ వాపోయారు. హైడ్రా కారణంగా నగరంలో పార్టీకి ఉన్న బలం కాస్తా తగ్గిందన్నారు. ప్రత్యేకించి హైడ్రా కమిషనర్ వ్యవహారం దారుణంగా తయారైందని వాపోయారు. తక్షణమే తనను మార్చాలని కోరారు. హైడ్రాతో ఎంతో నష్టం కలిగిందని, దీనిపై దృష్టిలో ఉంచుకోవాలని విన్నవించారు.