గుడ్ ఫ్రైడే సందర్బంగా సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడని తెలిపారు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం అన్నారు. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన బోధనలు పాటిస్తూ సర్వ మానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.