వైభవంగా శ్రీ కోదండ రాముని పుష్పయాగం
NEWS Apr 18,2025 09:31 am
ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామ స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది. తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మ వారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 2.5 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.