టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
NEWS Apr 18,2025 09:00 am
తిరుమలలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడారు. దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ, అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.