కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
NEWS Apr 17,2025 06:50 pm
తన వ్యక్తిగత ప్రచారం కోసం టీటీడీని రాజకీయాల్లోకి లాగుతున్నాడంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారని, వెంటనే హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జీవితంలో గోవుల జోలికి వెళ్లనని గోమత కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలన్నారు.