గత ఏడాదిలో 191 గోవులు మృతి
NEWS Apr 17,2025 06:46 pm
టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం కొనసాగుతోంది. మృతి చెందిన గోవుల జాబితా విడుదల చేశారు గోశాల మేనేజర్. గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 191 ఆవులు మృతి చెందాయని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొత్తం 45 ఆవులు చనిపోయినట్లు వెల్లడించారు. ఇక సెప్టెంబర్ 2025 లో 21 ఆవులు మరణించినట్లు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఏప్రిల్ లో 17, మేలో 18 ఆవులు మృతి చెందాయని తెలిపారు. కాగా 10 నెలల్లో 170 కి పైగా ఆవులు చని పోయాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.