హైదరాబాద్ లో మారుబెని కంపెనీ బిగ్ ఇన్వెస్ట్
NEWS Apr 17,2025 06:14 pm
జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు . తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పటుకు అంగీకారం కుదిరింది.టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందాన్ని కలిసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు కంపెనీ ప్రతినిధులు.