మెట్రో విస్తరణపై హైకోర్టులో విచారణ
NEWS Apr 17,2025 06:03 pm
పాతబస్తీలో మెట్రో విస్తరణ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విస్తరణ కారణంగా చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దంటూ సర్కార్ ను ఆదేశించింది. పురావస్తు శాఖ గుర్తించిన వాటి వద్ద ఎలాంటి పనులు చేపట్టవ వద్దని సూచించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు అడ్వకేట్ జనరల్. ఈనెల 22 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.