జడ్జి నియామకాల్లో బీసీలకు అన్యాయం
NEWS Apr 17,2025 03:10 pm
జూనియర్ సివిల్ జడ్జి JCJ, డిస్ట్రిక్ట్ జడ్జి DJ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాది జక్కుల వంశీకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి పరీక్ష రాసే బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ఎదుట న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి JCJ, డిస్ట్రిక్ట్ జడ్జి DJ, BC అభ్యర్థులకు రాత పరీక్ష, వైవా-వోస్ కనీస కట్-ఆఫ్ మార్కుల రిజర్వేషన్ లేదని న్యాయవాదులు అన్నారు.