వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో విచారణ
NEWS Apr 17,2025 02:01 am
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారని, పార్లమెంట్ కు చట్టాలు చేసే అధికారం లేదా అని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందంటున్నారు. చారిత్రక, పురావస్తు ప్రాంతాలను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడానికి వీలు లేదని స్పష్టం చేసింది.