ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే
NEWS Apr 17,2025 01:58 am
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనంటూ ప్రకటించారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తాను తిరుగుతున్నానని అన్నారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని, రమ్మంటున్నారని చెప్పారు. మళ్లీ పాలకుర్తిలో నిలబడతా , నా సంగతి , సత్తా ఏమిటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు.