రూ. లక్షకు చేరువలో బంగారం ధర
NEWS Apr 17,2025 12:59 am
రోజు రోజుకు పసిడి ధర పైపైకి పోతోంది. బంగారం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. రూ. లక్షకు దగ్గరలో ధర పలుకుతోంది. ప్రస్తుత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,100 కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే గ్రాముకు రూ.1650 కు ధర పెరిగింది. పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు. ఎలా కొనుగోలు చేయాలని వాపోతున్నారు.