సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది
NEWS Apr 17,2025 12:57 am
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ పై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. కోర్టుపై తమకు నమ్మకం ఉందన్నారు. చట్టాలకు లోబడి తమ ప్రభుత్వం భూములను కాపాడుకుంటుందని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. HCU అంశంలో బీఆర్ఎస్ విష ప్రచారం చేసిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశారని వాపోయారు. సంక్షేమాన్ని అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.