కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
NEWS Apr 16,2025 04:07 pm
ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఈడి చార్జిషీట్ లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం సరికాదని, కేంద్రం దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షంలో ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయించడం పట్ల మండిపడ్డారు.