చాహల్ ను హత్తుకున్న ముద్దుగుమ్మ
NEWS Apr 16,2025 09:21 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ ను ఛేదించలేక పోయింది. 112 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 95 రన్స్ కే పరిమితమైంది. ముంబైకి చెందిన యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయజాలంతో మ్యాజిక్ చేశాడు. ఏకంగా 4 వికెట్లు తీశాడు. కోల్ కతా పతనాన్ని శాసించాడు. కళ్లు చెదిరే బంతులతో పరేషాన్ చేయడంతో అందరూ పెవిలియన్ బాట పట్టారు. ఈ సందర్బంగా జట్టుకు గెలుపు అందించిన చాహల్ ను ఆనందంతో హత్తుకుంది పంజాబ్ ఎలెవన్ ఓనర్ ప్రీతి జింతా.