సోనియా, రాహుల్ పై ఛార్జిషీట్ దాఖలు
NEWS Apr 16,2025 08:57 am
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చేర్చింది. ఏజేఎల్ కు సంబంధించిన రూ. 700 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. కాంగ్రెస్ నేతలపై రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుపై ఈనెల 25న కోర్టులో విచారణ జరగనుంది. గాంధీ కుటుంబంపై ఇది తొలి ఛార్జ్ షీట్ కావడం విశేషం.