పోటెత్తిన భక్తజనం భారీగా హుండీ ఆదాయం
NEWS Apr 16,2025 07:47 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 73 వేల 543 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 346 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.22 కోట్లు వచ్చినట్లు ఈవో జె.శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.