111 పరుగులకే పంజాబ్ ఆలౌట్
NEWS Apr 15,2025 09:02 pm
ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్స్ రెచ్చి పోయారు. కళ్లు చెదిరే బంతులతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు చుక్కలు చూపించారు. జట్టును 15.3 ఓవర్లలోనే 111 పరుగులకే కట్టడి చేశారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ మాన్ 30 రన్స్ చేయగా, ప్రియాంశ్ ఆర్య 22 రన్స్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ ఆర్య డకౌట్ కాగా జోష్ 2 , వధేరా 10 , గ్లెన్ మాక్స్ వెల్ 7, సూర్యవంశ్ 3, సింగ్ 18, జాన్సన్ 1, జేవిర్ 10 పరుగులు చేశారు. వరుణ్ చక్రవర్తి 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్ 14 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 25 రన్స్ ఇచ్చి 3 వికెట్లుత ఈశాడు. వైభవ్ అరోరా 1 వికెట్ కూల్చాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ముందు 112 పరుగులు చేయాల్సి ఉంది.