భూముల అమ్మకంతోనే రాష్ట్రంలో పాలన
NEWS Apr 15,2025 02:18 pm
భూముల అమ్మకంతోనే తెలంగాణ పాలన సాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పులు తీసుకు రావడం, మద్యం , భూముల అమ్మకంతోనే ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. ఫ్లడ్ లైట్లు పెట్టి బుల్డోజర్ లతో రాత్రికి రాత్రి అడవిని నరికేయల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే తమిళనాడులో అన్నాడీఎంకేతో ఎన్డీయే కూటమి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీ లిమిటేషన్ పై ఎక్కడా చర్చ జరగలేదన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే బీజేపీ నిర్ణయాలు తీసుకుందన్నారు.