అందుబాటులో భూ భారతి పోర్టల్
NEWS Apr 15,2025 02:13 pm
తెలంగాణ సర్కార్ కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చింది భూ భారతి పోర్టల్. కేవలం 2 నుంచి 3 సెకన్లలోనే యాక్సెస్ అవుతోంది. 60 వేల మందికి పైగా యూజర్లు దీనిని వినియోగించారు. పారదర్శకత, అధికార వికేంద్రీకరణ, మెరుగైన రెవెన్యూ వ్యవస్థ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పోర్టల్ ను తీసుకు వచ్చింది సర్కార్. భూ లావాదేవీలు, రికార్డుల నిర్వహణకు ధరణి స్థానంలో భూబారతిని తీసుకు వచ్చింది. దీనిపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.