మంత్రి పదవి రేసులో నేనున్నా
NEWS Apr 15,2025 01:57 pm
కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో కాకా రేపుతోంది. నిన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు షాకింగ్ కామెంట్స్ చేస్తే మొన్న రాజగోపాల్ రెడ్డి భగ్గుమన్నారు. ఆయన జానారెడ్డిపై మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వాయిస్ పెంచారు. మంత్రి పదవి విషయంలో తనకు అసంతృప్తి ఉందన్నారు. పార్టీ హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ లీడర్ నని అన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పదవిని ఆశించడంలో తప్పు లేదన్నారు. అయితే తాను పార్టీ మారతానంటూ వస్తున్న ప్రచారం అబద్దమన్నారు.