టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసే కుట్ర
NEWS Apr 15,2025 01:46 pm
తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి . గోశాలలో ఆవులు చని పోయానని అబద్దపు ప్రచారాలు చేయడం దారుణమన్నారు. జరుగుతున్న పరిణామాల వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇది సున్నితమైన అంశమని, ఇప్పటికే దీనిపై ఈఓ శ్యామల రావు, ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించడం జరిగిందన్నారు.