గోదాములకు జీహెచ్ఎంసీ నోటీసులు
NEWS Apr 15,2025 01:36 pm
జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్న గోదాములపై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వందల సంఖ్యలో ఉన్న గోదాములు, కమర్షియల్ భవనాలకు నోటీసులు ఇచ్చింది. నివాస స్థలాల కోసం పర్మిషన్స్ తీసుకుని కమర్షియల్ కార్యకలాపాలు చేస్తున్నవ ఆరిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇళ్ల మధ్యలో ఉన్న గోదాములలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించింది. సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలంటూ నోటీసులో ప్రశ్నించింది.