వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
NEWS Apr 15,2025 01:26 pm
మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరారు సునీత పిటిషన్ లో. ఆయన పాత్ర ఏమిటని ప్రశ్నించింది కోర్టు. తన తండ్రిది హత్య కాదని గుండె పోటుగా చిత్రీకరించిన వారిలో తను కూడా ఒకరంటూ తెలిపారు సునీత తరపు న్యాయవాదులు. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్లతో పాటు ఈ పిటిషన్ జత చేసి విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.