పోక్సో కేసులో నిందితుడికి బెయిల్
NEWS Apr 15,2025 01:21 pm
బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 22 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. 2020లో యూపీకి చెందిన 22 ఏళ్ల యువకుడితో కలిసి న్యూ ముంబైకి చెందిన 15 ఏళ్ల బాలిక వెళ్లి పోయింది. 10 నెలల తర్వాత గర్భంతో ఇంటికి వచ్చింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక ఇష్ట ప్రకారమే వెళ్లిందని, ఆమెకు ఏం జరిగిందనేది తెలుసంటూ పేర్కొంది.