లేనిది ఉన్నట్లు నమ్మించడం బాబు నైజం
NEWS Apr 14,2025 04:03 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది సీఎం తీరు చూస్తుంటేనని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కు లేదని, పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం ఎందుకంటూ ప్రశ్నించారు. అందులో అద్భుత ప్రపంచం కడతానని, అర చేతిలో వైకుంఠం చూపించడం బాబుకే చెల్లిందన్నారు. AI పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబు గారికే తెలిసిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.