మహోన్నత మానవుడు అంబేద్కర్
NEWS Apr 14,2025 03:53 pm
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహోన్నత మానవుడు అంటూ కొనియాడారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఆర్టీసీ కళా భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆలంబనగా నిలిచాడని అన్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని , ఇవాళ అన్ని వర్గాల వారు ఉన్నత స్థానాలలో ఉన్నారంటే అంబేద్కర్ వల్లేనని గుర్తుంచు కోవాలని అన్నారు.