అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
NEWS Apr 14,2025 03:43 pm
దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని అన్నారు సీఎం చంద్రబాబు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ దేశం నడుస్తోందన్నారు. ప్రజలు తమ హక్కులను వినియోగించు కుంటున్నారంటే ఆయన చలవ వల్లేనని అన్నారు. శ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని అన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణాంగానే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందన్నారు.