మోదీ కామెంట్స్ అద్దంకి సీరియస్
NEWS Apr 14,2025 03:39 pm
తెలంగాణ ప్రభుత్వం పట్ల నోరు పారేసుకున్న ప్రధాని మోదీపై మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆయన దేశానికి పీఎంగా వ్యవహరించడం లేదని కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విషం కక్కడం మోడీకి మొదటి నుంచి ఆనవాయితీగా మారిందన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు, కార్యక్రమాలు చూసి ఓర్వలేక పోతున్నారంటూ ఆరోపించారు. బీజేపీ పాలన గురించి తాము చెప్పడం ప్రారంభిస్తే మోదీ తట్టుకోలేరన్నారు.