తిరుమలలో భక్తుల కిటకిట
NEWS Apr 14,2025 09:29 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 79 వేల 100 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 791 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.