ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చీఫ్ గా గంగూలీ
NEWS Apr 14,2025 09:13 am
ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అక్టోబర్ 23, 2019 నుండి అక్టోబర్ 18, 2022 వరకు మూడేళ్ల పాటు చీఫ్ గా కొనసాగారు. బీసీసీఐకి కూడా అధ్యక్షుడిగా పని చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకడిగా ఎంపికయ్యాడు. 2000 నుండి 2005 వరకు ఐదేళ్ల పాటు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. సౌరవ్ గంగూలీకి ఐసీసీ నుండి పదవి లభించడం ఇది రెండోసారి. 2021లో మొదటిసారి కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడేళ్ల పదవీకాలం తర్వాత ఆ పదవి నుంచి వైదొలిగిన సహచరుడు అనిల్ కుంబ్లే స్థానంలో భారత మాజీ కెప్టెన్ వచ్చారు.