ఘనంగా JCHSL జనరల్ బాడీ మీటింగ్
NEWS Apr 13,2025 07:16 am
HYD: జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగింది. అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షత వహించారు. 2019–2024 ఆర్థిక సం.లకు సంబంధించిన ఖా తాలు, ఆడిట్ నివేదికలు, 2014 –2024 సం.ల ఆదాయపన్ను సమస్యలపై వివరాలతో చర్చ జరి గింది. గోపన్నపల్లి 9.14 ఎకరాల స్థలానికి సంబం ధించిన కోర్టు కేసు పరిస్థితులపై నివేదిక సమర్పిం చారు. ప్రైవేట్ భూముల కొనుగోలుపై సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. సభ్యత్వ రద్దు ప్రక్రియలో భాగంగా ప్లాట్లు విక్రయించినవారు, రాజీనామా చేసినవారు, మరణించినవారి వివరాలను ప్రకటించారు. వాటిపై తీర్మానాలను ఆమోదించారు