బీజేపీ తమిళనాడు సారధిగా నైనార్ నాగేంద్రన్
NEWS Apr 13,2025 02:36 am
తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్ ను ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్ రావడంతో ఆయనకే ఈ పదవి ఖరారు చేశారు. అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.