కాంట్రాక్టర్ల తీరుపై సీతక్క ఫైర్
NEWS Apr 13,2025 02:29 am
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆరా తీశారు. నియోజకవర్గాలలో పెండింగ్ పనులపై కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్‌లను తొలగించాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి.