గోవులు మృతి చెందాయన్నది అబద్దం
NEWS Apr 13,2025 02:21 am
టీటీడీ ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇది పూర్తిగా అబద్దమన్నారు. గోశాలలో ఎప్పటి లాగే గోవులు భద్రంగా ఉన్నాయని తెలిపారు. ఆయన టీటీడీని కావాలని బద్నాం చేసేందుకు ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. భక్తులు ఎవరూ కూడా దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.