కాంగ్రెస్ పార్టీకి కపిలవాయి రాజీనామా
NEWS Apr 12,2025 05:18 pm
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా కపిలవాయి దిలీప్ కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి.