బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీస్
NEWS Apr 12,2025 05:14 pm
గ్రూప్ -1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఈ మేరకు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని అందులో కోరారు. సమాధానం చెప్పని పక్షంలో పరువు నష్టం వేస్తామని, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామంటూ హెచ్చరించారు.