ఎమ్మెల్యే పల్లాపై కడియం కన్నెర్ర
NEWS Apr 12,2025 05:06 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పార్టీ మార్పునకు సంబంధించిన అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. దానిపై తాను మాట్లాడబోనంటూ పేర్కొన్నారు. కోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.