రైస్ మిల్ లో అగ్ని ప్రమాదం
NEWS Apr 12,2025 04:39 pm
మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం, 85 వేల గోనె సంచులు కాలి బూడిద అయినట్లు యజమాని తెలిపారు. సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు గంగా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.