మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ కేసు
NEWS Apr 12,2025 09:50 am
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై సీరియస్ అయ్యారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ అనే నిందితుడిపై దాడికి పాల్పడ్డాడని చెప్పారు. పోలీసులపై జులుం ప్రదర్శించి విధులకు ఆటంకం కలిగించడం నేర పూరిత చర్యగా అభివర్ణించారు. చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని మాధవ్ అనుచరులతో కలిసి అడ్డుకున్నారని అన్నారు. మాధవ్‌తో పాటు మరో ఐదుగురు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. ఎస్పీ కార్యాలయం వద్ద కూడా మాధవ్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు.