ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలి
NEWS Apr 12,2025 09:39 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై సమీక్ష చేపట్టారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు.