భూముల స్కాంపై ఆర్బీఐకి లేఖ
NEWS Apr 12,2025 09:34 am
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్‌సీయూ భూముల పేరిట రూ. 10,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని అన్నారు. పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు. ప్రభుత్వం దగ్గర యాజమాన్య పత్రాలు లేని భూమిని ఎలా తాకట్టు పెట్టారంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ప్రోద్భలంతో బ్రోకర్ కంపెనీ రూ.169 కోట్ల లంచం తీసుకుందని ఆరోపించారు. ట్రస్ట్ ఎడ్వైజర్, బీకన్ ట్రస్టీషిప్‌ని ప్రభుత్వం ఎలా ఎంపిక చేసిందంటూ నిలదీశారు.సెబీ, ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేయాలని లేఖలు రాశామన్నారు.