రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది నిజమే
NEWS Apr 12,2025 09:30 am
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము అప్పు తీసుకు వచ్చింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. హెచ్ డీ ఎఫ్ సీ నుంచి కాదని ఐసీఐసీఐ నుంచి రూ. 10 ,000 కోట్లు రుణంగా తీసుకున్నామని చెప్పారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవి కావన్నారు. వాటిని ఎకరాకు రూ. 75 కోట్లకు టీఎస్ఐఐసీకి ఇచ్చామన్నారు. వారు తాకట్టు పెట్టి ఈ రుణం తీసుకున్నారని తెలిపారు. కేటీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ఆరోపించారు.